/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ONION-jpg.webp)
Onion Export; గతేడాది దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నివారించడం కోసం ఉల్లిపై నిషేధాన్ని విధించారు. అయితే, ఈ నెల అంటే మే నెలలో ఎగుమతి నిషేధం ఎత్తివేశారు. ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు 45,000 టన్నులకు పైగా ఉల్లిపాయలు మన దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. సాధారణ ఎన్నికలకు ముందు దేశీయ సరఫరాలను స్థిరీకరించేందుకు ఆంక్షలు విధించిన తర్వాత ఈ ఎగుమతులు రైతులకు ఉపశమనం కలిగించాయి. ప్రపంచంలోని అతిపెద్ద కూరగాయల ఎగుమతిదారుడు గా ఉన్న భారత్ నుంచి గత డిసెంబర్‌లో ఉల్లి ఎగుమతులపై నిషేధం మార్చి 2024 వరకూ విధించారు. ఉల్లి పంట తగ్గడంతో ధరలు పెరగడంతో మార్చిలో దానిని పొడిగించారు. అయితే, ఉల్లి రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో.. మే నెల మొదటి వారంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేశారు.
నిషేధం ఎత్తివేశారు..
Onion Export: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే పిటిఐతో మాట్లాడుతూ, “నిషేధం ఎత్తివేసిన దగ్గర నుండి 45,000 టన్నులకు పైగా ఉల్లి ఎగుమతి చేశారు. ఈ ఎగుమతి ఎక్కువగా మధ్యప్రాచ్యం .. బంగ్లాదేశ్‌కు జరిగింది. టన్నుకు కనీస ఎగుమతి ధర (MEP) US $ 550 గా నిర్ణయించారు” అని చెప్పారు
Also Read: ఆకాశానంటుతున్న కంచి పట్టు చీరల ధరలు..రెండేళ్లలో 50 శాతం పెరుగుదల!
ఈసారి పంటలు బాగా ఉండవచ్చు..
Onion Export: ఈ ఏడాది మంచి రుతుపవనాల సూచన ఉంది. అందువల్ల జూన్ నుండి ఉల్లితో సహా ఇతర ఖరీఫ్ పంటలను రైతులు ఎక్కువగా విత్తే అవకాశం ఉందని ఖరే చెప్పారు. ప్రస్తుత సంవత్సరానికి 5,00,000 టన్నుల బఫర్ స్టాక్ లక్ష్యంగా.. ప్రభుత్వ సంస్థలు ఇటీవలి రబీ పంట నుండి ఉల్లిని సేకరించడం ప్రారంభించాయని ఆయన చెప్పారు.
తక్కువ ఉత్పత్తి
Onion Export: వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొదటి అంచనా ప్రకారం, మహారాష్ట్ర, కర్ణాటక .. ఆంధ్రప్రదేశ్ వంటి కీలక ఉత్పత్తి ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తి కారణంగా 2023-24 పంట సంవత్సరంలో దేశంలో ఉల్లి ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరం కంటే, 16 శాతం పడి 25.47 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.