One year Prison to Bandla Ganesh: నటుడు, నర్మిత బండ్ల గణేష్‌కుమళ్ళీ విక్ష పడింది. ఒంగోలు కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష (One Year Jail), 95 లక్షల జరిమానా విధించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య చనిపోయాక ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ (Cheque Bounce) అయింది. దీంతో జానకి రామయ్య తండ్రి కోర్టుకు వెళ్ళారు. ఈ కేసులోనే కోర్టు బండ్ల గణేష్‌కు శిక్ష విధించింది.
Also Read: Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్
ఇంతకు ముందు కూడా శిక్ష...
2017లోనూ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష వేసింది. రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ (Vakkantham Vamsi) వేసిన కేసులో ఎర్ర మంజిల్ కోర్టు గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటూ 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. అప్పుడు 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ మీద గణేష్ బయటకు వచ్చేశారు. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఎన్టీయార్ నటించిన టెంపర్ (Temper) సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.
నటుడు నుంచి నిర్మాతగా...
బండ్ల గణేష్ (Bandla Ganesh) మొదట చిన్న కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిన్న చిన్న పాత్రల నుంచి నిర్మాతగా ఎస్టాబ్లిష్ అయ్యారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గణేష్. 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయడానికి సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే టికెట్ దక్కలేదు. తరువాత ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.