Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు..ఎప్పటివరకు పూర్తవుతుందంటే..!!

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ఎంతో కోలాహాలంగా కొనసాగుతోంది. నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన లంబోదరుడి శోభాయాత్ర..రాత్రంతా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ పై కిలోమీటర్ల మేర గణనాథులు నిమజ్జనానికి వేయింటింగ్ లో ఉన్నాయి. రాత్రంతా భారీ వర్షం కురిసినా..వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. 11రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తోపాటు వంద చోట్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది.

New Update
Ganesh Immersion: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాట్లు ఇవే..

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ఎంతో కోలాహాలంగా కొనసాగుతోంది. నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన లంబోదరుడి శోభాయాత్ర..రాత్రంతా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ పై కిలోమీటర్ల మేర గణనాథులు నిమజ్జనానికి వేయింటింగ్ లో ఉన్నాయి. రాత్రంతా భారీ వర్షం కురిసినా..వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. 11రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తోపాటు వంద చోట్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: వరల్డ్ కప్‎లో బిగ్ ఛేంజ్…ఆయన అవుట్..ఈయన ఇన్..టీమిండియా కొత్త జట్టు ఇదే..!!

చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా కోలాటాలతో గణనాథుడిని సాగనంపుతున్నారు. నవరాత్రుల్లో పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. హైదరాబాద్ లో భక్తి శ్రద్దలతో వైభవంగా మండపాలు ఏర్పాటు చేసి...విఘ్నాలు తొలగించమని వినాయకుడిని వేడుకున్నారు. కన్నుల పండవగా సాగుతున్న శోభాయాత్రలతో గౌరీపుత్రునికి సంబురంతో వీడ్కోలు పలుకుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతిని వైభవంగా సాగర్ లో నిమజ్జనం చేశారు.

ఇది కూడా చదవండి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!

కానా నిన్న గురువారం రాత్రి నుంచి ఇప్పటివరకు 7వేల 200 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. వందల వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వేచిచూస్తున్నాయి. అటు నారాయణగూడ, హిమయాత్ నగర్, లిబర్టీ, లక్డికాపూర్, టెలిఫోన్ భవన్, బషీర్ బాగ్, ట్యాంక్ బండ్ పరిసరప్రాంతాలన్నీ గణనాథులతో బ్లాక్ అయ్యాయి. ఇక రాత్రి 1గంటలకు చార్మినార్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. పాతబస్తీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముగిసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు