/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/one-plus-1-jpg.webp)
SmartWatch: వన్ ప్లస్ కు భారత మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారుదారీ సంస్థ నుంచి మార్కెట్లోకి ఏ ప్రొడక్టు విడుదలైనా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అంటే వన్ ప్లస్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరో మూడు రోజుల్లో ఓ సరికొత్త ప్రొడక్టు మార్కెట్లోకి విడుదల కానుంది. అదే వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ 2. దీని ఫీచర్లు, స్పెక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఫీచర్లు:
- వాచ్ స్క్రీన్- 1.43 అంగుళాలు
- డిస్‌ప్లే సైజ్- 46ఎంఎం
- డిస్‌ప్లే మెటీరియల్- సఫైర్ క్రిస్టల్ ఆల్మోడ్ డిస్‌ప్లే
- ప్రాసెసర్- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ W5 Gen 1 చిప్సెట్
- బ్యాటరీ లైఫ్- 100 గంటలు
- కలర్స్- రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్
- బ్యాటరీ సామర్థ్యం- 402ఎంఏహెచ్
- వాటర్ రెసిస్టెంట్- IP68 రేటింగ్
- ఓఎస్- గూగుల్ WearOS 4.0
- ధర- రూ.16,999 (అంచనా మాత్రమే)
- విడుదల అంచనా తేదీ- 2024 ఫిబ్రవరి 26
ప్రీ బుకింగ్స్:
వన్ ప్లస్ లాంచ్ చేయనున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ 2 కు సంబంధించి ప్రీ బుకింగ్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. కేవలం రూ. 99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ స్టోర్ లతోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ కామర్స్ ఆన్ లైన్ స్టోర్స్ లో కూడా ఈ వాచ్ ను బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్