One Plus 12 Launch: మార్కెట్‌లోకి కొత్త మొబైల్స్ ఏమైనా లాంచ్ అవుతున్నాయంటే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా యువత కొత్త ఫోన్లపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతుంది. ఇక కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారు.. పాత ఫోన్‌ని మార్చాలనుకునేవారు సైతం మార్కెట్‌లోకి వచ్చిన న్యూ మొబైల్స్ అప్‌డేట్స్ ఫాలో అవుతుంటారు. వీరందరికి వన్ ప్లస్ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ లేటెస్ట్ వెర్షన్ వన్‌ప్లస్-12ను లాంచ్ చేయనుంది.
స్మూత్ బియాండ్ బిలీఫ్:
వన్‌ప్లస్ అభిమానులకు ఈరోజు(జనవరి 23) చాలా ప్రత్యేకమైన రోజు. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్-12, వన్‌ప్లస్-12Rలను ఇవాళ భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్‌లు శక్తివంతమైన ప్రాసెసర్, గ్రేట్ కెమెరా సెటప్, శక్తివంతమైన బ్యాటరీతో వస్తాయి. ఫోన్‌తో పాటు, కంపెనీ కొత్త బడ్స్ - వన్‌ప్లస్ బడ్స్-3 కూడా రిలీజ్ కానుంది. ఈ ఏడాది(2024) మొదటి లాంచ్ ఈవెంట్‌కు 'స్మూత్ బియాండ్ బిలీఫ్' అని పేరు పెట్టింది. ఈ ఈవెంట్ రాత్రి 7:30నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని కంపెనీ య్యూటుబ్(YouTube) ఛానెల్ (OnePlus India)లో చూడవచ్చు.
స్పెసిఫికేషన్లు:
ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల క్వాడ్ HD + LTPO డిస్‌ప్లేను అందించబోతోంది. ఈ OLED ProXDR డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయితో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో గరిష్టంగా 24 GB LPDDR5x RAMని అందించబోతోంది. ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ని చూడవచ్చు. ఫొటోగ్రఫీ కోసం, కంపెనీ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను అందించనుంది. వీటిలో సోనీ LYT 808 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (వైడ్ యాంగిల్), 64-మెగాపిక్సెల్ OV64B 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి.
వన్ ప్లస్-12 బేస్ వేరియంట్ ధర రూ. 64,999 ఉండొచ్చని అంచనా. 16 జీబీ వేరియంట్ రూ. 69,999 ధర ట్యాగ్‌తో రావచ్చని సమాచారం. వన్‌ప్లస్-12 విక్రయం జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్-12R కోసం ఫిబ్రవరి వరకు వేచి ఉండవలసి ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
Also Read: అయోధ్య రామునికి ఏడువారాల నగలు..వాటి విలువ ఎంతో తెలుసా..
WATCH: