EV : కారు కొనాలనుకుంటున్నారా? ఈ ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా లక్ష డిస్కౌంట్..!!

ఎంజీ ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 1లక్ష రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. డిజైన్ పరంగా చిన్నగా ఉన్నా..వేగంగా అమ్ముడవుతున్న మోడల్స్ లో ఒకటిగా నిలిచింది. కారు లాంచింగ్ సమయంలో ధర రూ. 7.98లక్షల ఉండగా..ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 6.99లక్షలకే లభిస్తుంది.

EV : కారు కొనాలనుకుంటున్నారా? ఈ ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా లక్ష డిస్కౌంట్..!!
New Update

MG EV Car :  ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. మార్కెట్లో భారీగా పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఆయా కంపెనీలు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఎంజీ సంస్థ కొత్త ఏడాదిలో మరొక అడుగు ముందుకు వేసింది. ఈ మధ్యే కొత్త డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ కారు(Electric Car) పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో పోటీని తట్టుకుని కస్టమర్ల మెప్పును పొందేందుకు ఎంజీ ఎలక్ట్రిక్ కారు(MG Electric Car) పై ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది.

తక్కువ సమయంలో వేగంగా అమ్ముడవుతున్నకారు: 

ఈ ఎంజీ ఈవీ(MG EV) డిజైన్ పరంగా చూసేందుకు చిన్నగా ఉన్నా అందరి చూపు మాత్రం తిప్పుకోకుండా చేస్తోంది. ఈ కారు గత ఏడాది లాంచ్ అయ్యింది. నగర ప్రాంతాల్లోని ప్రజలు ఆకట్టుకుంటుంది. తక్కువ సమయంలో వేగంగా అమ్ముడవుతున్న మోడల్స్ ఒకటిగా నిలిచింది. ఈ కారును లాంచింగ్ సమయంలో బేస్ వేరియంట్ ధర రూ. 7.98లక్షలు ఉంది. ఇప్పుడు లక్ష తగ్గింపుతో రూ. 6.99లక్షల కు అందుబాటులో ఉంది. చూడటానికి ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండే ఈ కారు లేటెస్టు ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది. సిటీ పరిధిలో ట్రావెల్ చేసేవారికి ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పవచ్చు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 230 కిలోమీటర్లు:

ఇక ఈ కారులోని ఫీచర్లు చూస్తే 17.3కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 230 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇది 42బీహెచ్ పీ గరిష్ట శక్తిని అందిస్తుంది. 110 ఎన్ఎం టార్క్ ను ఇస్తుంది. ఈ ఈవీ సిస్టమ్ 3.3కే డబ్ల్యూ ఏసీ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. 100శాతం బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు 7 గంటల సమయం పడుతుంది. అయితే ఈ కారును నెలరోజుల పాటు నడిపేందుకు అయ్యే ఖర్చు రూ. 500 మాత్రమే అని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: చైనాకు చుక్కలే.. 2వేల కిలోమీటర్ల దూరంలోని శత్రువులను ఒక్క దెబ్బతో ఫసక్ చేయవచ్చు!

#electric-car #mg-motors #mg-electric-car
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe