Most Popular Global Leader - Modi: మార్నింగ్ కన్సల్ట్ యొక్క గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 76 శాతం ఆమోదం రేటింగ్‌తో ప్రపంచంలోని 22 ప్రముఖ నాయకుల జాబితాలో ప్రధాని మోదీ (PM Modi) అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మలోనీ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్స్‌లో 66 శాతం ఆమోదం రేటింగ్‌తో మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రధాని మోదీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు.
కాగా, మూడో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బర్సెట్‌కు 58 శాతం ఆమోదం లభించింది. అలాగే, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా 49 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. 47 శాతం రేటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఐదవ స్థానంలో ఉన్నారు.
ఎవరికి ఎంత రేటింగ్ వచ్చింది?
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌లో 41 శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. ఏడో స్థానంలో ఉన్న బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూకు 37 శాతం రేటింగ్ లభించింది. అదే సమయంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, తొమ్మిదో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు చెందిన పెడ్రో శాంచెజ్‌లకు కూడా 37 శాతం రేటింగ్ వచ్చింది.
రేటింగ్స్‌లో, ఐరిష్ ప్రధాని లియో వరద్కర్ 36 శాతం ఆమోదం రేటింగ్‌తో పదో స్థానంలో ఉన్నారు. వరద్కర్ తర్వాత, స్వీడన్‌కు చెందిన ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, పోలాండ్‌కు చెందిన మార్కిన్‌కివిచ్జ్ ఉన్నారు. ఆ తర్వాత 13వ స్థానంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 31 శాతం రేటింగ్‌ను పొందారు. ఇది కాకుండా, బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ 17వ స్థానంలో ఉన్నారు. 25 శాతం రేటింగ్‌ను పొందారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?