Delhi: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం.. తనిఖీలు చేయగా.. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bomb Threat: ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే నగరంలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపు రావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. Also Read: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..! పాఠశాలను బాంబుతో పేల్చేస్తామని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. స్కూల్‌లో బాంబు పెట్టినట్లు మెయిల్ పంపారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సదరు పాఠశాల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ కానీ పేలుడు పదార్థాలూ కానీ లభించలేని తెలిపారు. An email was received at a school in Delhi's Greater Kailash area, threatening to blow up the school with a bomb. It is written in the email that a bomb was planted in the school yesterday. Nothing has been found in the investigation so far, legal action initiated: Delhi Police — ANI (@ANI) August 2, 2024 ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. #delhi #latest-news-in-telugu #bomb-threat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి