Ayodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు!

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

New Update
Viral News: హనీమూన్‌ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!

Ayodhya Ram Mandir : ఎన్నో దశాబ్దాలుగా కలలు కన్న అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir)  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా ఎంతో సమయంలేదు. మరికొన్ని గంటల్లో ఆ అద్భుత కార్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రామ మందిర అధికారులు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల ఉన్న రామ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రామ మందిర గురించి ఎన్నో విశేషాలు మన ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిరంలో మరో అద్భుత విశేషం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి(Sri Rama Navami)  నాడు సూర్యుడు బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

బాల రామునికి సూర్య తిలకంగా మారనున్నాడు. సూర్యుని సంచారం ఆధారంగా ప్రతి సంవత్సరం సూర్య తిలకం రామ నామంగా మారేటట్లు ప్రత్యేకమైన అద్దాలను రామ మందిరంలో అమర్చనున్నట్లు దీని కోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(Indian Institute Of Astrophysics) సాయం తీసుకున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా గర్భ గుడిలోని విగ్రహం పై ఏడాదికి ఒకసారి అంటే శ్రీరామ నవమి నాడు మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్య తిలకం మొదలై ఆరు నిమిషాల పాటు బాల రాము(Bala Ram) ని విగ్రహం నుదుటన ప్రసరించనుంది.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహం పై సూర్య కిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌ బాక్స్లు గొట్టాలను ఏర్పాటు చేయనున్నారు. రామ మందిరం నిర్మాణంతో పాటు ఈ ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఇనుము, విద్యుత్‌ వాడలేదని ఆలయాధికారులు తెలిపారు.

Also read: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు