Kerala: కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సుమారు 160 మంది చనిపోయినట్లు అధికారులు నిర్థారించగా...600 మంది కార్మికులు కనిపించకుండ పోయినట్లు సమాచారం.ఈ ప్రమాదం నుంచి బయటపడిన 120 మందిని అధికారులు ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
వయనాడ్ లోని పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడూ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ మీడియాకి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వయనాడ్ కు వెళ్తున్న మంత్రి వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. వయనాడ్‌లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3,069 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also read: గ్రీన్‌కార్డు హోల్డర్లకు… కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం!