Wayanad: వయనాడ్ కు వెళ్తుండగా..మంత్రి వాహనానికి ప్రమాదం! కేరళలో కొండ చరియలు విరిగిపడిన వయనాడ్ కు వెళ్తున్న క్రమంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి. By Bhavana 31 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kerala: కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సుమారు 160 మంది చనిపోయినట్లు అధికారులు నిర్థారించగా...600 మంది కార్మికులు కనిపించకుండ పోయినట్లు సమాచారం.ఈ ప్రమాదం నుంచి బయటపడిన 120 మందిని అధికారులు ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వయనాడ్ లోని పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడూ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ మీడియాకి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వయనాడ్ కు వెళ్తున్న మంత్రి వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Kerala: Rescue operation underway by Indian Air Force helicopters in the Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 93 people. pic.twitter.com/FbaJRQd1eo — ANI (@ANI) July 30, 2024 తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. వయనాడ్‌లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3,069 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. Also read: గ్రీన్‌కార్డు హోల్డర్లకు… కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం! #vina-george #minister #wayanad #kerala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి