On Line classes: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను 750 ఎపిసోడ్లను సిద్ధం చేసినట్లు టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అనేక పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇది ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ప్రసారమయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చ్పొప్పున 10 ఎపిసోడ్స్ 75 రోజుల పాటు టీ-సాట్ నెట్ వర్క్ చానళ్లలో ప్రసారమవుతాయని సీఈవో వివరించారు.
పూర్తిగా చదవండి..Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు – టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ
గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
Translate this News: