ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల కానున్నాయని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు కోటాను సోమవారం విడుదల చేయనుంది.

New Update
ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

publive-image

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేస్తున్నట్లు తెలిపింది. భక్తులందరూ https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు అని టీటీడీ తెలిపింది. అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం, తోమాల, అర్చన, ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం ఈ నెల 19న ఉదయం 10 నుంచి 21వ తేదీ ఉదయం 10 వరకు నమోదు చేసుకోవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22న 10 గంటలకి విడుదల చేస్తామని ఆలయం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, మాసం కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్‌ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం పదింటికి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు