/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/lok-sabha-speaker-om-birla-accepts-the-no-confidence--jpg.webp)
Parliament Attack : లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడి రచ్చ రచ్చ(Parliament Attack) చేసిన సంగతి తెలిసిందే. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా(Om Birla) స్పందించారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. సభలో వదిలిన పొగ.. ప్రమాదకరమైనది కాదని తెలిపారు. సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. జీరో అవర్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు అమోల్ షిండే, మరొక మహిళ పేరు నీలమ్ కౌర్. పార్లమెంట్ ముందు నియంతృత్వం ఇక చెల్లదు అంటూ నిందితులు నినాదాలు చేశారు.
लोकसभा की सुरक्षा में बड़ी चूक, सदन की कार्यवाही में एक शख्स घुसा #LokSabha pic.twitter.com/wCe5VslUnB
— Nikhil Tyagi (@NikhilT37865100) December 13, 2023
లోక్ సభ(Lok Sabha) సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్ వదలడం వీడియోలో కనిపిస్తోంది. అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్ సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Also Read: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?