Lok Sabha: లోక్ సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..అసలేమైందంటే?
లోక్ సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. వారు టియర్ గ్యాస్ వదలడంతో భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.