Olympics Hockey Semi Final: జర్మనీ vs ఇండియా హాకీ మ్యాచ్‌ మరి కొద్ది గంటల్లో.. లైవ్ ఎక్కడంటే.. 

పారిస్ ఒలింపిక్స్ లో భారత్, జర్మనీ హాకీ సెమీఫైనల్ టోర్నీ జరగనుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. జర్మనీ కూడా దూసుకువచ్చింది. జర్మనీ vs ఇండియా హాకీ టోర్నమెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అందుకు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు

New Update
PM Modi: భారతహాకీ ప్లేయర్లకు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

Olympics Hockey Semi Final:  పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ సింగ్ సేన పటిష్ట జర్మనీతో తలపడనుంది. ఇప్పటికే టీమ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇంతలోనే భారత హాకీ జట్టుకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య పెద్ద షాక్ ఇచ్చింది. సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి అమిత్ రోహిదాస్‌పై నిషేధం విధించారు. క్వార్టర్ ఫైనల్  మ్యాచ్ జరుగుతున్న సమయంలో, అతని హాకీ స్టిక్ పొరపాటున గ్రేట్ బ్రిటన్ ఆటగాడి ముఖానికి తగిలింది. దీంతో మైదానంలో ఉన్న రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇచ్చాడు. దీంతో అమిత్ ఈ సెమీ-ఫైనల్స్‌లో ఆడే ఛాన్స్ కోల్పోయాడు. ఇప్పుడు భారత్ అతను లేకుండానే మెరుగైన ప్రదర్శన కనబరచవలసి ఉంది. 

పురుషుల హాకీ సెమీ ఫైనల్ ఎప్పుడు?

భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం (ఆగస్టు 6), 2024న జరిగే పారిస్ ఒలింపిక్స్ 2024లో జర్మనీతో సెమీ-ఫైనల్ ఆడనుంది.

భారత పురుషుల హాకీ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఏ సమయానికి జరుగుతుంది?

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ-ఫైనల్ మ్యాచ్ IST రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇండియా vs జర్మనీ మ్యాచ్ ఎలా చూడాలి?

ఇండియా వర్సెస్ జర్మనీ హాకీ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది 

ఇండియా vs జర్మనీ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్

ఇండియా vs జర్మనీ హాకీ మ్యాచ్ JioCinemaలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది 

భారత్ ప్రధానమైన ఆటగాళ్లు వీరే.. 

భారత్‌కు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్. ఆరు మ్యాచ్ ల్లో ఏడు గోల్స్ చేసిన సింగ్ భారత్ ఆశలకు కీలకంగా ఉన్నాడు.  ఒక్క మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురైన డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ గైర్హాజరు కావడంతో జట్టు కొద్దిగా నిరాశగా ఉంది. ఇప్పుడు జర్మనీ ధాటికి వరుణ్ కుమార్, సురేందర్ కుమార్ తమ సత్తా చాటాల్సి ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు