హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలపై పోలీసుల దాడులు

మత్తు పదార్థాలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అయినా నగరంలో మాత్రం ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల సప్లై అనేది కొనసాగుతునే ఉంది. దీనిపై అధికారులు మరింత స్పీడ్ పెంచి, ప్రత్యేక బృందాలతో తనిఖీ చేసి..తాజాగా మెఫెంటెర్‌మైంన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు.

New Update
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలపై పోలీసుల దాడులు

Police efforts to make Hyderabad free of intoxicating liquids

ప్రత్యేక బలగాలతో తనిఖీలు

నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో పెద్దమొత్తంలో మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 400 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లో పరిధిలోని వట్టెపల్లి, దుర్గానగర్‌ కూడలిలో మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న నితీష్, సోహెల్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధిక ధరలకు అమ్మకాలు

దీనిపై డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మెఫెంటెర్‌మైంన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సప్లై చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. సోహెల్, నితీష్ ఇద్దరు జిమ్ నిర్వాహకులుగా ఉండి, వీరు ఇద్దరు ఈ ఇంజెక్షన్ 300 రూపాయలకు కొని 1000 నుండి 1400 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ  సల్ఫేట్ ఇంజెక్షన్ ఆపరేషన్ థియేటర్లో వాడతారు, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు పెంచడానికి ఈ మెడిసిన్ వాడుతారని తెలిపారు.

మరణించే ప్రమాదం ఉంది

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఈ ఇంజక్షన్లు వాడాలని, బాడీ బిల్డర్లు కూడా హఠాత్తుగా చనిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఇంజక్షన్ల వల్ల హఠాత్తు మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఇంజెక్షన్ల వల్ల వ్యాయామం చేసే స్టామినా పెరుగుతుందని, ఈ ఇంజక్షన్‌ వల్ల అదనపు సామర్థ్యం లభించి ఎక్కువగా జమ్ చేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీంతో బ్లడ్ ప్రెషర్ పెరిగుతుందన్నారు. బాడీ త్వరగా వస్తుందని ఈ ఇంజక్షన్లను ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా వాడుతున్నారని తెలిపారు.

పట్టుబడిన ఇంజక్షన్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రధాన సూత్రధారి ఎవరనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జిమ్‌లో బాడీబిల్డర్లు ఈ ఇంజెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు