kids: మీ పిల్లలు తప్పక నేర్చుకోవాల్సిన పాతకాలం పద్ధతులు

ఈ జనరేషన్ పిల్లలకు ఓపిక తక్కువ. తల్లిదండ్రులు కొన్ని పాత పద్ధతులను నేర్పిస్తే పిల్లలను తప్పుదారి పట్టించకుండా కాపాడుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఆ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
kids: మీ పిల్లలు తప్పక నేర్చుకోవాల్సిన పాతకాలం పద్ధతులు

kids: ఇప్పుడున్న పిల్లలను మైంటైన్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. పాత రోజుల్లో పిల్లల పెంపకంపై ఒక పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అలాంటి పద్ధతులు గురించి ఏమీ తెలవదు. అయితే ప్రస్తుత కాలంలో పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లల్లో కూడా కొన్ని అలవాట్లు వస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, ఫోన్‌, కంప్యూటర్లకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. చిన్నపిల్లలు అయితే ఫోన్ ఇస్తేనేగాని తినడానికైనా, మరి ఏ పనులకైనా సపోర్ట్ చేస్తారు.

పిల్లలను తప్పుదారి పట్టించకుండా:

అయితే..పిల్లలు మొబైల్‌కి ఎక్కువ అడక్ట్ అవితే వారి మెదడుపై ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై కొన్ని పాత పద్ధతుల గురించి వారితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి సూచిస్తున్నారు. తప్పుల్ని యాక్సెప్ట్ చేయడం, చేసిన తప్పును అంగీకరించే గట్స్ వంటివి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి. వీటితో పాటు కొన్ని పాత పద్ధతులను నేర్పిస్తే పిల్లలను తప్పుదారి పట్టించకుండా కాపాడుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు.ఈ కాలంలో వారు ఏమి కావాలని అడిగినా వెంటనే అది వాళ్ళ దగ్గరకు వస్తుంది. మరి అల ఇచ్చిన వస్తువులను వారు భద్రపరచుకుంటారా..? లేదా..? అనేది పిల్లల అలవాటుపై ఉంటుంది.

వస్తువుల విషయంలో సపోర్ట్ వద్దు:

ఈ జనరేషన్ పిల్లలకు ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వారికి సేవ చేసుకోవడం ఎలాగో నేర్పించాలి. ఏదైనా వస్తువులు పాడైతే దాని స్థానంలో వేరేది వస్తుందని ఆలోచనలో వారు ఉంటారు. ఇలా పాడు చేసుకున్న ప్రతి వస్తువును కొనిచ్చే వరకు తల్లిదండ్రులను ఇబ్బంది పడతారు. ఇలా కొత్తవి కొనుగోలు చేయటంలో వారి సపోర్ట్‌ చేయకుండా పాత వస్తువులనే రిపేర్ చేసి ఎలా పండుకోవాలో వాళ్ళకి కచ్చితంగా నేర్పించాలి. బంధువులు, స్నేహితల విషయానికి వస్తే.. వారితో చిరునవ్వుతో పలకరించడం, పని చిత్త శుద్ధితో చేయడం, కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం వంటి వారికి  నెర్పించాలి. ఇంట్లో వారి పనులు వారే చేసుకోవడం,  వాటిని ఆచరించేలా తల్లిదండ్రులు చేప్పాలి. అప్పుడే వారు పిల్లల గొప్పగా ఆలోచలు, ఓపిక అలవాటు అవుతుంది. ఇలాంటి పాతకాలం పద్ధతులు వారి జీవితం ఎంతో గొప్పగా సాగటానికి అవకాశం ఉంటుంది.

ఇది  కూడా చదవండి: సంక్రాంతికి కొత్త అల్లుడికి ఎందుకంత ప్రాధాన్యత..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు