Nokia G42 5G: నోకియా నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. రూ. 9,999 ధరకే..!

నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా బడ్జెట్ సెగ్మెంట్ లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ నోకియా జీ42 5జీని విడుదల చేసింది. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్‌ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభం కానున్నాయి.

New Update
Nokia G42 5G: నోకియా నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. రూ. 9,999 ధరకే..!

Nokia G42 5G: నోకియా లేటెస్ట్ బడ్జెట్ నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ను హెచ్ఎండీ గ్లోబల్ శుక్రవారం లాంఛ్ చేసింది.హచ్ఎండీ నోకియా ఇండియాలో చాలా తక్కువ ధరలో విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువచ్చింది. భారత్ మార్కెట్ లో ఇప్పటికే పదివేలలోపు ధరలో ఫుల్ కాంపిటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు నోకియా తీసుకు వచ్చిన నోకియా G42 5జి కొత్త వేరియంట్ తో ఈ సెగ్మెంట్ లో మరింత సెగపుడుతుంది.

నోకియా జి42 5జి కొత్త వేరియంట్ ను కేవలం రూ. 9,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్,హెచ్ఎండీ. కామ్ నుంచి మార్చి 8 వ తేది నుండి సేల్ ప్రారంభం అవుతుంది. నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 12,999 రూపాయల స్టార్టింగ్ ధరలో లభిస్తుండగా..ఇప్పుడు కొత్త వేరియంట్ తో ఈ ఫోన్ ధర రూ. 9,999 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. నోకియా 4జిబి ర్యామ్ 128జీబీ స్టోరేజ్‌తో నోకియా జీ42 5జీని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌లో వర్చువల్‌గా 2జీబీ ర్యామ్ వరకు విస్తరించవచ్చు.

మీరు బడ్జెట్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, నోకియా జి42 5జీ మీకు ఉత్తమ ఎంపిక. నోకియా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను అందించింది. సున్నితమైన పనితీరు కోసం, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా డిస్‌ప్లేలో అందించింది. ఇందులో కంపెనీ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌ని ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో మీరు 2 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతారు.

మీరు స్మార్ట్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీ చేస్తే, ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్ అయితే 2-2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మాక్రో లెన్స్ అందించింది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 20వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి, ఇది 5000ఎంహెఎచ్ బ్యాటరీని కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: మోదీతో దీదీ భేటీ…ఇది రాజకీయ సమావేశం కాదన్న మమతా.!

Advertisment
Advertisment
తాజా కథనాలు