అయ్యో టమోటా ఎంత పని చేశావే... దంపతులను విడదీశావు తెలుసా ఓ టమాట కూర ఇద్దరు భార్య భర్తలని విడదీసి వెళ్ళింది. అవునండి మీరు విన్నది నిజమే.. కూరలో టమాటాలు వేశాడని భర్తను వదిలి వెళ్లిపోయింది ఓ మహిళ. టమాటాలు ఖరీదు పెరిగినప్పటికి తనకు తెలియకుండా కూరలో వేసినందుకు నీతో ఉండనంటూ బిడ్డను తీసుకొని వెళ్లిన భార్య ఆచూకి కోసం భర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. By Vijaya Nimma 13 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కాపురం కూల్చిన టమోటా కూరగాయల వల్ల కాపురాలు కూలుతున్నాయంటే ఎవరైనా నమ్ముతారా..ఎవరూ నమ్మరు..కానీ ప్రస్తుతం నమ్మాల్సిన పరస్థితి వచ్చింది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. అయితే దాని ప్రభావం దాన్ని ఇష్టపడే వారికి చేదుజ్ఞాపకాల్ని మిగుల్చుతోంది. టమాటా కూర ఓ పేదవాడి కాపురంలో కుంపటిలా మారింది. మధ్యప్రదేశ్ షహ్‌దోల్ జిల్లాలోని బెమ్‌హౌరీ గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ వర్మకు చిన్న హోటల్ ఉంది. దాంట్లో రోజు వేసినట్లుగానే టమాటాలు వేసి కూరలు వండించాడు. అంతే ఆ చిన్న విషయానికే సంజీవ్‌కుమార్ భార్య అంత ఖరీదైన టమాటాలు కూరల్లో, సాంబర్‌లో వేస్తావా అంటూ కోపంతో అతడ్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. టమాటా ధరలు పెరగడంతో చాలా రెస్టారెంట్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో టమాటాని మెనులోంచి తీసేశారు.ఈ విషయం తెలియక సంజీవ్‌కుమార్ కేవలం కూరలో టమాటాలు వేసినందుకు భార్య తనపై అలిగి కోపంతో వెళ్లిపోవడంతో తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ధన్‌పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది అసలు ఏం జరిగింది..ఎటు వెళ్లిపోయిందనే విషయాన్ని కనుగొంటున్నారు. తప్పైందని చెప్పినా వినలేదు హోటల్‌లో వండే కూరల్లో టమాటా వేశాడనే కోపంతో తన కూతురిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లింది సంజీవ్ కుమార్ వర్మ భార్య. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ వార్త స్థానికంగానే కాదు..ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.ఇదే అంశంపై అసలు ఏం జరిగిందని సంజీవ్‌కుమార్ వర్మను అడిగితే జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పుకొని బాధపడ్డాడు. టమాటాలు కూరలో వేసినందుకు తన భార్యకు కోపం వచ్చిందని ఆ విషయం తెలిసి తాను తప్పైందని చెప్పినప్పటికి వినలేదని ..మరొకసారి ఇలాంటి పొరపాటు చేయనని వేడుకున్నా నా మాట వినిపించుకోకుండా ఇంటి నుంచి తన చిన్నారి కూతుర్ని కూడా తీసుకొని వెళ్లిందని బాధపడ్డాడు. ఈవిషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కూరగాయల వల్ల కాపురంలో చిచ్చు రావడం ఏమిటని ..టమాటాలు కూరలో వేసినందుకు భార్య ఇల్లు వదిలిపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు అయితే దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పలు చోట్ల కిలో టమాట రూ.200లు పలుకుతున్న విషయం తేలిసిందే. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో కూరగాయల ధరలు ఆకాశాన్న తాకాయి. టమాటా, మిర్చి, అల్లంతో పాటు ఇతర కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారులకు ఊరటను కలిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమోటాలను కొనుగోలు చేయాలని నాఫెడ్, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి