Office Work: ఈ 7 టిప్స్ పాటిస్తే మీ ఆఫీస్ లో మీరే కింగ్.. అవేంటో ఓ లుక్కేయండి!

ఆఫీస్‌కు టైమ్‌కు వెళ్లడం అన్నిటికంటే ముఖ్యం. ఇక ఇతరుల మాటలు పట్టించుకోకుండా వర్క్‌పై కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే చేసే పనికి న్యాయం జరిగినట్లు అవుతుంది. ఏమైనా పొరపాట్లు జరిగినా వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి.

New Update
Office Work: ఈ 7 టిప్స్ పాటిస్తే మీ ఆఫీస్ లో మీరే కింగ్.. అవేంటో ఓ లుక్కేయండి!

Office Work: ఆఫీస్ అన్నాక ఇబ్బందులు సహజమే. కొన్ని సర్దుకు పోతేనే లైఫ్ బాగుంటుంది. లేదని ఎదురు తిరిగితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేనికైనా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే ఎవరు మనల్ని వేలెత్తి చూపరు. అదే మనం సరిగ్గా పని చేయకపోతే అందరి వేళ్ళు మన వైపే ఉంటాయి. అందుకని ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం కచ్చితంగా మంచిగా పనిచేసే తీరాలి. అప్పుడే మన వైపు చూపించే వేలుకు సమాధానం చెప్పగలం. ఏదైనా సమస్య వచ్చిందంటే అది వర్క్‌లో దెబ్బ కొట్టలే తప్ప.. వేరే ఇతర కారణాలు ప్రయోగించకూడదు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మన విలువెంటో అందరికీ తెలుస్తుంది.

ఆఫీస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఇన్చార్జి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఎదురు తిరగకూడదు. ఎందుకంటే అందరిని కలుపుకొని పోతేనే వర్క్ హ్యాపీగా, సంతోషంగా చేసుకోగలుగుతాము. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

నచ్చని వ్యక్తులు ఉంటారు:

  • ఆఫీస్‌లోనే కాదు ఎక్కడైనా మనకు నచ్చని వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ బిహేవియర్, మాట తీరు అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారిని పట్టించుకోకుండా నీ వర్క్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదే నీకు, నీ లైఫ్‌కి, నీ వర్క్‌కు మంచి చేస్తుంది. ఒక పొజిషన్‌లోకి తీసుకువెళ్తుంది.

నచ్చినా నచ్చకపోయినా నీకు సంబంధం లేదు:

  • వర్క్ అన్నాక అనేక రకాల స్టైల్లో ఉంటుంది. నీ స్టైల్‌లో నువ్వు చేసిందే నీకు గొప్ప. అంతేకానీ వాళ్ళలాగా చేయలేదు, వీళ్ళలాగ చేయలేదనే ఫీలింగ్ నీలోకి రాకూడదు. అలా వస్తే నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకున్నట్లు అవుతుంది. అలాంటి విషయాలు ఎప్పుడూ మైండ్‌లోకి రానివ్వకూడదు. వర్క్‌పై కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే చేసే పనికి న్యాయం జరిగినట్లు అవుతుంది.

సమయానికి రావడం ముఖ్యం:

  • ప్రతి ఆఫీస్‌లో టైమింగ్స్ ఉంటాయి. దానిని ఫాలో కావటం మన బాధ్యత. అందరికీ సమయానికి రావటం కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో మీపై అధికారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటివి రోజు జరగకుండా సమయానికి వచ్చేలా చూసుకుంటే మంచిది.

గుర్తింపు ముఖ్యం.. పొగడ్తలు కాదు:

  • మన వర్క్‌ ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తుంచుకునేలా చేయాలి. అదే మనకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. అంతేకానీ ఎవరికోసమో, టార్గెట్ల కోసమో వర్క్‌ను చేయకూడదు. ఎంత వర్క్ చేశామో అన్నది కాదు ఎంత మంచిగా చేశామన్న ఇంపార్టెంట్. అదే మనకి లైఫ్‌ని ఎదిగలా చేస్తుంది.

కొన్ని పొరపాట్లు సహజమే పట్టించుకోకూడదు:

  • ఆఫీస్‌లోనే కాదు ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వీటిని సీరియస్‌గా తీసుకొని మైండ్‌ని పాడు చేసుకోవద్దు. ఏమైనా పొరపాట్లు జరిగిన వాటిని మరిచిపోయి అందరితో కలిసి మెలిసి ఉంటూ సంతోషంగా వర్క్‌పై శ్రద్ధ పెట్టాలి.

జరిగేది ఇదే:

  • ఎక్కడికి వెళ్లినా ఇలాంటి సమస్యలు సహాజం. ఆఫీస్ వదిలేసి ఇంకో ఆఫీస్‌కు వెళ్లినా ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని.. అందరూ మనకు నచ్చినట్లు ఉండరు కాబట్టి మనమే అందరినీకి నచ్చినట్లు అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోవాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. పని కూడా మంచిగా చేస్తామని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: శ్వాసకు గుండెపోటుకు సంబంధం ఏంటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు