మైండ్ బ్లాక్ ఆఫర్: ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.59వేలకే.. రూ.11 వేల భారీ తగ్గింపు

ఫ్లిప్ కార్ట్ లో ఓడిస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆఫర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈ2గో మోడల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర వచ్చేసి రూ.71,100గా ఉంది. కానీ ఇది ఇప్పుడు రూ.59వేల బడ్జెట్ లో సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బ్యాంక్ ఆఫర్ కింద రూ.3,155, అలాగే ఈ స్కూటర్ ని ప్రిపెయిడ్ ఆఫర్ కింద మరో రూ.8వేల వరకు..

New Update
మైండ్ బ్లాక్ ఆఫర్: ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.59వేలకే.. రూ.11 వేల భారీ తగ్గింపు

మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అది కూడా భారీ తగ్గింపు ధరల్లో.. అయితే మీకు ఇది గుడ్ న్యూసే. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.11 వేల భారీ తగ్గింది. అవునా ఎక్కడ? ఏంటి? అని షాక్ అవుతున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సంస్థ ద్వారా మీరు స్కూటీ తీసుకుంటే రూ.11 వేల భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ లో ఓడిస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆఫర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈ2గో మోడల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర వచ్చేసి రూ.71,100గా ఉంది. కానీ ఇది ఇప్పుడు రూ.59వేల బడ్జెట్ లో సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బ్యాంక్ ఆఫర్ కింద రూ.3,155, అలాగే ఈ స్కూటర్ ని ప్రిపెయిడ్ ఆఫర్ కింద మరో రూ.8వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటీ రూ.59,945కే వచ్చేస్తుంది.

ఓడిస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు:

1. పోర్టబుల్ బ్యాటరీ
2. డిజిటల్ స్పీడో మీటర్
3. డిస్క్ బ్రేక్స్
4. కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కాగా ఫ్లిప్ కార్ట్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏడాది పాటు నో కాస్ట్ ఆన్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. దీంతో సంవత్సరం పాటు వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలలో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. ఏడాది టెన్యూర్ అయితే రూ.5925 కట్టాలి.

ఇక 9 నెలలకు అయితే రూ.7,900, 18 నెలలకు అయితే నెలకు రూ.4400, ఇక 24 నెలలు అయితే నెలకు రూ.3414 పడుతుంది. అదే ఆరు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ.11,850, మూడు నెలలకు అయితే రూ.23,700 పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఒక్కసారి చార్జింగ్ పెడితే 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. బ్యాటరీ చార్జింగ్ ఫుల్ కావడానికి 4 గంటలు పడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు