Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా?

ఒడిశా, జార్ఖండ్‌లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి కంపెనీకి చెందిన స్థలాల్లో భారీగా కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు నోట్ల లెక్కింపు పూర్తి అవగా.. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మెషీన్లు కూడా మొరాయించాయి.

New Update
Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా?

కట్టలకు కట్టల డబ్బులు..కాదు కాదు..గుట్టలకు గుట్టల నోట్ల కట్టలు..500, 200, 100రూపాయల నోట్లు. ఎస్‌. ఒడిశా(Odisha)లో జరిగిన ఐటీ దాడుల్లో..ఏ కోటో..రెండు కోట్లో కాదు. ఏకంగా వందల కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. వాటిని లెక్కించలేక కౌంటింగ్‌ మెషీన్లు కూడా మొరాయించాయంటే ఎన్ని వందల కోట్లు దొరికాయో ఊహించడం కూడా కష్టంగానే మారింది.


ఐటీ శాఖకు చెందిన 36 బృందాలు ఒడిశా, జార్ఖండ్‌, బెంగాల్‌లోని 36 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి.

publive-image కట్టలకు కట్టల డబ్బులు

రూ.250 కోట్లకు పైగా నగదు:
ఒడిశా బోలంగీర్‌, సంబల్‌పూర్‌, జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగా ఏరియాలోని లిక్కర్‌ కంపెనీలకు చెందిన ఆఫీసులు, ఇళ్లలో రైడ్స్‌ నిర్వహించారు ఐటీ అధికారులు. బీరువాల్లో దాచిన కోట్ల రూపాయల నగదు చూసి అధికారులే షాకయ్యారు. 9 బీరువాల్లో గుట్టలకు గుట్టల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కపెడుతుండగా కొద్దిసేపటికే మొరాయించాయి కౌంటింగ్‌ మెషీన్లు. ఇప్పటివరకు మొత్తం 250 కోట్లకు పైగా నగదు లెక్కించామని..ఇవాళ(డిసెంబర్‌ 8) కూడా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఐటీ అధికారులు. లెక్కించిన నగదును 157 బ్యాగుల్లో నింపి ట్రక్కుల్లో బ్యాంకుకు తరలించారు.

publive-image మొత్తం 250 కోట్లకు పైగా నగదు స్వాధినం

బంగారం కూడా:
జార్ఖండ్‌కు చెందిన ఓ ఎంపీతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో పట్టుబడిన నగదు విలువ మొత్తం 510కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఐతే దీంతోపాటు భారీగా బంగారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బుల లెక్కలు కంప్లీట్‌ అయ్యాక గోల్డ్‌ ఆర్నమెంట్స్‌ను లెక్కించనున్నట్టు సమాచారం. లిక్కర్‌ వ్యాపారి జార్ఖండ్‌ నుంచి వచ్చి ఒడిశాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని..సంస్థకు భారీ నష్టం వాటిల్లినట్టు చూపి సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు పన్ను ఎగవేత ఆరోపణలుండటంతో సోదాలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిపిన దాడుల్లో వందల కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. పెద్ద మొత్తంలో దొరికిన నగదును సీజ్‌ చేశారు ఐటీ అధికారులు.

Also Read: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్‌ రిపోర్ట్!

WATCH:

Advertisment
తాజా కథనాలు