Scrub Typhus in Odisha: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటికే ఐదుగురి మృతి..ఏపీలో కూడా ఒకరు! ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్‌గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. By Bhavana 15 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Scrub Typhus in Odisha: ఒడిశాలో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్‌గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డేంజర్ బెల్స్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఆరోగ్య విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) నిర్మూలనకు అవసరమైన సూచనలు చేసింది. దీని నుంచి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది. వ్యాధిని వీలైనంత త్వరగా వ్యాధి సోకిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యాధిని నిర్థారించడానికి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని , అందుకు అవసరమైన టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యాధికారులు కు తెలిపారు. Also Read: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఆడియో వైరల్..!! ఈ వ్యాధి గురించి ప్రజలకు కూడా తగిన అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు ఒడిశా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఈ స్క్రబ్ టైఫస్ నే బుష్ టైఫస్ (Bush Typhus) అని కూడా అంటారు. ఓరియెంటా సుసుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుందని అధికారులు నిర్థారించారు. ఈ బ్యాక్టీరియా సోకిన కీటకాలు కుట్టడం ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వేగంగా సంక్రమిస్తుంది. ఈ క్రమంలో ఏపీ (AP)లో ఒక స్క్రబ్ టైపస్ మరణం నమోదు అయ్యింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన మధు (20) అనే యువకుడు కొద్ది రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. కానీ జ్వరం తగ్గకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతను గురువారం ప్రాణాలు విడిచాడు. మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే మధు స్వగ్రామానికి అధికారులు చేరుకున్నారు. ప్రత్యేక బృందం తెలిపిన వివరాల ప్రకారం మధు స్క్రబ్ టైపస్ తోనే మృతి చెందినట్లు ఈ బృందం గుర్తించి..నివేదిక ఉన్నతాధికారులకు పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఓ కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని వివరించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి పిచికారి చేశారు. చనిపోయిన యువకుడి కుటుంబ సభ్యులను ఇప్పటికే అబ్జర్వేషన్ లో ఉంచారు. Also Read: ఒకే ఒక్క రాకాసి అల వేల ప్రాణాలను మింగేసింది. #odisha #scrub-typhus #scrub-typhus-in-odisha #scrub-typhus-in-ap #scrub-typhus-in-bargarh #five-die-of-scrub-typhus #bush-typhus #scrub-typhus-in-andhrapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి