Health Tips: మనస్సులో గందరగోళంగా, అవాంఛిత ఆలోచనలు ఎల్లప్పుడూ వస్తూ ఉంటే వాటిని ఆపలేకపోవచ్చు. అయితే అది మానసిక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల, అవాంఛిత ఆలోచనలు ఎల్లప్పుడూ మనస్సులోకి వస్తూటాయి. ఈ సమస్యను తరచుగా 'అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్' (OCD) అంటారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది... దానిని నివారించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మనసులో వింతలు ఆలోచనల వ్యాధి బారిన పడటానికి కారణాలు:
OCD అనేది ఒక మానసిక వ్యాధి. దీనిలో ఒక వ్యక్తి మనస్సులో అనవసరమైన ఆలోచనలు పదే పదే వస్తాయి. వాటిని వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేక పనిని చేయాల్సి ఉంటుంది.
పునరావృత ఆలోచనలు: అవాంఛనీయమైన కలవరపెట్టే ఆలోచనలు పదే పదే గుర్తుకు వస్తాయి కావున వాటిని ఆపడం కష్టం.
బలవంతపు ప్రవర్తన: అటువంటి ఆలోచనలను వదిలించుకోవడానికి ఒక వ్యక్తి చేతులు కడుక్కోవడం, పదే పదే వస్తువులను తనిఖీ చేయడం, లెక్కించడం వంటి కొన్ని పనులను పదేపదే చేస్తాడు.
ఆందోళన-భయం: ఈ ఆలోచనలు, ప్రవర్తనలు ఒక వ్యక్తికి చాలా ఆందోళన, భయాన్ని కలిగిస్తాయి.
సమయం వృధా: ఒక వ్యక్తి ఈ ఆలోచనలు, ప్రవర్తనలో రోజులో చాలా సమయాన్ని వృధా చేయవచ్చు. ఇది వారి రోజువారీ పనికి ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జికా, నిపా లేదా చండీపురా…ఏ వైరస్ అత్యంత ప్రమాదకరం?