Delhi police: ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రధాని, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో స్టేజీ వెనకాల కనిపించిన జంతువు వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ‘కొన్ని మీడియా ఛానెల్లు, సోషల్ మీడియా వేదికలు జంతు చిత్రాన్ని చూపించి, అది అడవి జంతువుగా పేర్కొంటున్నాయి. అది నిజం కాదు. కెమెరాలో బంధించబడిన జంతువు సాధారణ ఇంటి పిల్లి. దయచేసి ఇలాంటి పనికిమాలిన పుకార్లను ప్రచారం చేయొద్దు’ అని కోరారు.
పూర్తిగా చదవండి..Delhi: అది పులి కాదు పిల్లి.. పనికిమాలిన వార్తలు ఆపండి: ఢిల్లీ పోలీసులు
మోడీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో వైరల్ గా మారిన జంతువు వీడియోపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. 'అది అడవి జంతువు కాదు. ఇంట్లో పెంచుకునే పిల్లి. దయచేసి పనికిమాలిన పుకార్లను ప్రచారం చేయొద్దు' అని కోరారు.
Translate this News: