Delhi: అది పులి కాదు పిల్లి.. పనికిమాలిన వార్తలు ఆపండి: ఢిల్లీ పోలీసులు మోడీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో వైరల్ గా మారిన జంతువు వీడియోపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. 'అది అడవి జంతువు కాదు. ఇంట్లో పెంచుకునే పిల్లి. దయచేసి పనికిమాలిన పుకార్లను ప్రచారం చేయొద్దు' అని కోరారు. By srinivas 10 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi police: ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రధాని, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో స్టేజీ వెనకాల కనిపించిన జంతువు వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. 'కొన్ని మీడియా ఛానెల్‌లు, సోషల్ మీడియా వేదికలు జంతు చిత్రాన్ని చూపించి, అది అడవి జంతువుగా పేర్కొంటున్నాయి. అది నిజం కాదు. కెమెరాలో బంధించబడిన జంతువు సాధారణ ఇంటి పిల్లి. దయచేసి ఇలాంటి పనికిమాలిన పుకార్లను ప్రచారం చేయొద్దు' అని కోరారు. ప్రమాణ స్వీకార వేదిక దగ్గరలోనే.. అసలేం జరిగిందంటే.. ప్రధాని సహా పలువురు కీలకమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో ఓ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియా వేదికగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతున్నాయి. మొదట ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది. నడుస్తున్న ఠీవిని బట్టి అది పులి అని కొందరు.. పిల్లి అయ్యుంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చనన్న ఊహాగానాలూ వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసులు పిల్లేనని స్పష్టం చేశారు. #delhi-police #cat-video #modi-oath-ceremony మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి