OMG : ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ.. హారర్ అండ్ కామెడీ మూవీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిందా?

వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో ఓ మంచి ఘోస్ట్సినిమా తెరకెక్కింది. కామెడీ అండ్ హారర్ బ్యాక్ డ్రాప్ తో రుపొందిన ఈ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. కామెడీ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు.

New Update
OMG : ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ.. హారర్ అండ్ కామెడీ మూవీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిందా?

O Manchi Ghost Review : సౌత్ సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగులో ఈ మధ్య హర్రర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా వాటి పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవలే హర్రర్ చిత్రాలుగా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2', 'పిండం' సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జానర్ లో తాజాగా 'మంచి ఘోస్ట్' అంటూ మరో కామెడీ హర్రర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది.ఈ సినిమా కథ ఏంటి? ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే.. మేనమామ ఎమ్మెల్యే సదా శివ రావు (నాగినీడు) వద్దకు చైతన్య (రజత్) ఒక సహాయం కోసం వెళతాడు. కానీ తన మామ సహాయం చేయకపోవడంతో ఆయన పోస్టర్ మీద తన పోస్టర్ పై పేడ తీసుకొని కొడతాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపుతారు. అక్కడ చైతన్యకు మరో ముగ్గురు పరిచయమవుతారు. వాళ్లకు డబ్బు అవసరం పడుతుంది. చైతన్య వాళ్ళతో కలిసి మేనమామ కుమార్తె కీర్తి (నందిత శ్వేత) నీ కిడ్నాప్ చేసి కీర్తిని కిడ్నాప్ చేసి ఆ ఊరి చివరన ఉన్న ఒక బంగ్లాలో వేస్తారు. అక్కడ ఒక దయ్యం ఉంటుంది. ఎవరైతే కిడ్నాప్ చేస్తారో కిడ్నాప్ చేసిన వారిని ఆ దయ్యం చంపుతూ ఉంటుంది. మరి ఆ దయ్యం నుంచి ఈ నలుగురు బయటపడ్డారా? లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ: హర్రర్ కామెడీ చిత్రం అంటే భయంకరమైన సంఘటనలు ఎన్ని ఉంటాయో కామెడీ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇలాంటి తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇక ఈ సినిమాలో కూడా ఎంత కామెడీ ఉందో అంతే భయంకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత వచ్చే సీన్ ఏంటి అనే విషయం ప్రేక్షకులు చాలా తొందరగా అంచనా వేయగలుగుతారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది.

ఒక్కసారి ఈ గ్యాంగ్ ఆ మహల్‌లో ఎంట్రీ ఇచ్చాక కథ మారుతుంది. అక్కడి నుంచి నవ్వుల పంట పండిచేస్తుంటారు. ఇంటర్వెల్‌కు ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలతో చేసే కామెడీ హైలెట్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే కనుక సెకండ్ పార్ట్ కూడా రాబోతుందా అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. మొత్తానికి ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు.

యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే: వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. ఎప్పటిలాగే మరోసారి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరోసారి తన నటన విశ్వరూపం చూపించింది. ఇక రఘుబాబు రజత్ నవీన్ వీరందరూ కూడా వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.

టెక్నికల్‌ గా ఎలా ఉంది : ఈ సినిమా ఈ పాటలు పరవాలేదు, విజువల్స్ బాగుంటాయి. కెమెరా వర్క్‌తోనే భయపెట్టేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు అద్భుతమైన స్క్రీన్ పైన చూపించారు ఇక నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

రేటింగ్ : 3

Advertisment
Advertisment
తాజా కథనాలు