NVS Admissions 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా? నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఇవాళే చివరి తేదీ. దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష 10 ఫిబ్రవరి 2024న ఉంటుంది. హాల్ టికెట్లు navodaya.gov.in అందుబాటులో ఉండనున్నాయి. By Shiva.K 15 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NVS Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకునే వారికి అలర్ట్. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 9, 11 తరుగుల ప్రవేశానికి సంబంధించి అప్లికేషన్స్ నేటితో ముగియనున్నాయి. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఎవీఎస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. 9, 11 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్ష 10 ఫిబ్రవరి, 2024లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు ప్రకనటలో తెలిపింది. అభ్యర్థులు ఎన్‌విఎస్ అధికారిక వెబ్‌సైట్navodaya.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక నవోదయ విద్యాల సమితి(ఎన్‌విఎస్) 9, 11 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నవోదయ విద్యాలయ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ ఎగ్జామ్(జెఎన్‌విఎస్‌టి) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇవాళే చివరి తేదీ. గడువు ముగిసిన తరువాత దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ☛ ముందుగా విద్యార్థులు లేదా తల్లిదండ్రులు navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ☛ ఆ తర్వాత JNV క్లాస్ 9, 11 అడ్మిషన్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి. ☛ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయండి. ☛ అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి. ☛ రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. ☛ తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తప్పులు సరి చేసుకునే వెసులుబాటు.. NVS జారీ చేసిన ప్రకటన ప్రకారం.. నేటితో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్ ఫారమ్‌లో తప్పులను సరి చేసుకోవచ్చు. ఇందుకోసం నవంబర్ 16, 17 తేదీల్లో అవకాశం ఉంటుంది. ఈ సమయంలో.. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు కొన్ని ఎంపిక చేసిన వర్గాల్లో మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. లింగం, వర్గం, వైకల్యం మాత్రమే మార్పులు చేయడానికి వీలుంటుంది. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్.. ఎన్‌వీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 6, 9, 11 తరగతుల ప్రవేశానికి సంబంధించిన పరీక్ష 10 ఫిబ్రవరి 2024న జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను 100 రోజుల ముందే జారీ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఎన్‌విఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Also Read: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ‘కోట్ల’ కట్టలు.. #navodaya-vidyalaya-samiti #nvs-extends-class-11-lateral-entry-selection #nvs-admit-card-2023 #jnv-class-6-admission-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి