Nvidia: మైక్రోసాఫ్ట్ కు షాక్ ఇచ్చిన ఎన్‌విడియా.. అత్యంత విలువైన కంపెనీగా రికార్డ్! ప్రపంచంలోనే అతివిలువైన కంపెనీగా ఇప్పటివరకూ నిలిచిన మైక్రోసాఫ్ట్ కు సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా షాకిచ్చింది. దాదాపు రూ. 278 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో మైక్రోసాఫ్ట్( సుమారు రూ.276 కోట్లు) ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. By KVD Varma 19 Jun 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Nvidia: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్‌విడియా మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. Nvidia Corp షేర్లు జూన్ 18, మంగళవారం నాడు $ 4.60 (3.51%) పెరుగుదలతో $ 135.58 (సుమారు రూ. 11,300) వద్ద ముగిసింది. ఈ షేర్ల పెరుగుదలతో కంపెనీ మార్కెట్ క్యాప్ 3.34 లక్షల కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 278 లక్షల కోట్లు) పెరిగింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.32 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు 276 లక్షల కోట్లు). మంగళవారం నాడు మైక్రోసాఫ్ట్ షేర్లు 0.45% తగ్గి $446.34 వద్ద ముగిసింది. Nvidia: ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ మార్కెట్ క్యాప్ గురించి చెప్పాలంటే, ఇది 3.29 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 274 లక్షల కోట్లు). ఆపిల్ షేర్లు మంగళవారం 1.10% క్షీణించి $214.29 వద్ద ముగిసింది. పన్నెండు రోజుల క్రితం ఆపిల్ ను దాటి.. Nvidia: అంతకుముందు జూన్ 5న ఎన్విడియా యాపిల్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఆ సమయంలో ఎన్‌విడియా మార్కెట్ క్యాప్ 3.01 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 251 లక్షల కోట్లు), మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.15 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 262 లక్షల కోట్లు), యాపిల్ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 250 లక్షల కోట్లు). ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన సెమీకండక్టర్ సంస్థ.. NVIDIA భారతదేశంలో నాలుగు ఇంజనీరింగ్ అభివృద్ధి కేంద్రాలను కలిగి ఉంది. ఇవి హైదరాబాద్, పూణే, గురుగ్రామ్, బెంగళూరులో ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఎన్విడియా తన AI యాక్సిలరేటర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. GPU రూపకల్పన..తయారీ.. NVIDIA ఒక సాంకేతిక సంస్థ, ఇది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) రూపకల్పన, తయారీకి ప్రసిద్ధి చెందింది. దీనిని 1993లో జెన్సన్ హువాంగ్, కర్టిస్ ప్రీమ్, క్రిస్ మలాచోవ్స్కీ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉంది. Nvidia గేమింగ్, క్రిప్టోకరెన్సీ మైనింగ్, ప్రొఫెషనల్ అప్లికేషన్‌ల కోసం చిప్‌లను డిజైన్ చేస్తుంది అలాగే తయారు చేస్తుంది. దీనితో పాటు, దాని చిప్ వ్యవస్థలు వాహనాలు, రోబోటిక్స్, ఇతర పరికరాలలో కూడా ఉపయోగపడతాయి. #microsoft #market-capitalization #nvidia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి