Nursing Course: ఏపీలో ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్. ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే ఉత్తీర్ణత సాధించినవారికి నర్సింగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇది కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకు (Kurnool District) మాత్రమే వర్తిస్తుంది. ఈ జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు నర్సింగ్ చేసే ఛాన్స్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ చేయాలనుకుంటున్న వారికి ఏఎన్ఎం (ANM) రెండేళ్ల కోర్సుకు సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే..మీకు షుగర్ ఉన్నట్లేనట..!!
కాగా ఏఎన్ఎం రెండేళ్ల కోర్సులో మొత్తం 40సీట్లు ఉంటాయి. అయితే ఇంటర్ చదవినా మహిళలు ఏ గ్రూపులో అయినా సరే ఉత్తీర్ణత సాధించి ఉంటే డిసెంబర్ 31,2023వ తేదీ నాటికి 17ఏళ్లు నిండిన వారై ఉండాలి. దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి వయోపరిమితి అవసరం లేదన్నారు. ఏఎన్ఎం రెండేళ్ల కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి దరఖాస్తుల కోసం కర్నూలులోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతోపాటు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు 4 పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వెళ్లాలి. ఇక ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకునే అభ్యర్థులు http://cfw.ap.nic.in లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. కాగా పూర్తి వివరాలతో అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా కర్నూలు పట్టణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో సమర్పించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!