Nursery: రైతులకు వరంగా నర్సరీలు.. నారును పెంచుతూ మేలు చేస్తున్న దంపతులు తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయం దండుగ కాకుండా పండుగలా మారింది. గతంలో వర్షధారిత పంటలు సాగుమీద ఆధారపడిన రైతులు... ఇప్పుడు ఏటా మూడు పంటలతో వరిసాగు చేసుకుంటున్నారు. గతంలో లేని విధంగా వడ్లు పుట్లు నిండుతున్నాయి. మరోవైపు కూరగాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బుట్టలు నిండుతున్నాయి. ఈ సదావకాశాన్ని చాలామంది అందిపుచ్చుకుని లాభాలు అర్జిస్తున్నారు. By Vijaya Nimma 22 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి నర్సరీలను పెంచుతూ ఉపాధి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాడిచర్లపల్లికి వికారాబాద్ జిల్లా, కొడంగల్ నుంచి రేణుక-అశోక్ అనే దంపతులు వలస వచ్చి నర్సరీలను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. పదేళ్లుగా కూరగాయల నారును పెంచుతూ, వినాయక నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది…ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు ఏర్పాటు చేసుకునేవారు. అయితే వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక పాడైపోయేవి. కానీ ప్రస్తుతం కొత్త టెక్నాలజీ వచ్చాక వ్యవసాయ దారులకు కొన్నియంత్రాలు.. నర్సరీలు రైతులకు చాలా మేలు చేస్తున్నాయి. మంచి లాభాలు అయితే రేణుక-అశోక్‌తో పాటు.. పలుచోట్ల కూరగాయల నర్సరీలను పెంచుతూ కొందరు ఉపాధి కూడా ఇస్తున్నారు. ఒక ఎకరం భూమి లీజుకు తీసుకొని, ఏకరంలో కూరగాయల నారు నర్సరీ నిర్వహిస్తున్నారు. టమాట, మిర్చి, వంకాయ, పొప్పడి, మునిగా, బెండ కూరగాయల నారు సిద్దం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. నారు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఓ విధానాన్ని పాటిస్తున్నారు ఆ రైతులు. తమిళనాడు నుంచి కొబ్బరి పీసు తీసుకోచ్చి, దానికి కెమికల్ కలిపి కోక ఫీట్‌గా మార్చుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ట్రెలలో కోకాఫీట్ చేసి, నాణ్యమైన కూరగాయల విత్తనాలు నాటి నారు సిద్దం చేస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయల సీడ్స్ రేటును బట్టి కూరగాయల నారును అమ్ముతున్నారు. టమాట ఒక మొక్కను 50 పైసలకు, మిర్చి ఒక మొక్కను ఒక్క రూపాయికి అందిస్తున్నట్లు నిర్వాహకురాలు రేణుక-అశోక్ తెలిపారు. కూరగాయల నర్సరీలతో మంచి లాభాలు ఉన్నాయని, మరో ఇద్దరికి ఉపాధి దొరికిందని రేణుక తెలిపారు. సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల రైతులు కూడా వినాయక నర్సరీకి వచ్చి నారు తీసుకుపోతున్నారని ఆ దంపతులు తెలిపారు. పాత పద్దతిలో.. కూరగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు ఏర్పాటు చేసుకునే వారు. వారం రోజులు ధాన్యాన్ని నానబెట్టి.. నారుమడులో చల్లేవారు. అయితే వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక అది పాడైయి. రైతులకు తీవ్ర నష్టం వచ్చేంది. ప్రస్తుతం ఈ నర్సరీలు వచ్చాక రైతులకు చాలా మేలు జరుగుతోంది. నారుకోసం రైతులు ఇతర జిల్లాలకు వెళ్లేవారు. స్థానికంగా వీటిని ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి నారును కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారంతో అటు రైతులకు, ఇటు నిర్వాహకులుకు మేలు జరుగుతోంది. గాడి చర్లపల్లి నర్సరీలో నాణ్యమైన కూరగాయల నారు లభిస్తుందని రైతులు చెబుతున్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన నారు తమ వ్యవసాయ క్షేత్రాలలో కూరగాయల విత్తనాల నారు పోస్తే, సరిగా మొలకెత్తడం లేదని.. మరోవైపు నకిలీ విత్తనాలతో కూరగాయల నారు సరిగా రావడం లేదంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ మొలకెత్తినా కోతులు, పిట్టలు, అడవి పందులు నెమలులు, బెడదతో కూరగాయల నారు చేతికి వస్తలేదంటున్నారు. అందుకే నర్సరీలో పెంచిన కూరగాయల నారును కొనుగోలు చేస్తే... నర్సరీలలో తక్కువ ధరలోనే నాణ్యమైన నారు దొరుకుతుందని, క్రాప్ కూడా ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. కూరగాయల నారు కొనడంతో సమయం కూడా కలిసి వస్తుందని, లాభ సాటిగా లాభాలు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంతో తెలంగాణలో మారిన పరిస్థితులతో వ్యవసాయం లాభసాటిగా మారింది. వ్యవసాయాధారిత పనులతో పలువురు లాభాలు అర్జించటం మంచి పరిణామం. ఇది ఇలానే కొనసాగి పచ్చని పంటలు పండి అందరు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు సంతోషంగా ఉండాలని కోరుకుందాం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి