కడప జిల్లాలో నగ్నపూజల కలకలం

కడప జిల్లాలో నగ్నపూజలు కలకలం రేపాయి. లక్షల్లో డబ్బులు వస్తాయని అమ్మాయిలకు వల వేసి, డబ్బుల వీడియోలను చూపించి మోసం చేస్తున్నారు. చెప్పిన పని చేయకపోతే వీడియోలు వైరల్‌ చేస్తామని వేధింపులకు గురి చేసి, కడప జిల్లా రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
కడప జిల్లాలో నగ్నపూజల కలకలం

Nudist riots in Kadapa district

డబ్బు ఆశ చూపి నగ్న పూజలు

కడప జిల్లాలో ఓ పూజారి గుట్టురట్టయింది. నగ్నపూజలు చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను ట్రాప్ చేశాడు. యువతులతో నగ్నపూజలు చేసిన పూజారి.. అనంతరం వారిని బెదిరింపులకు గురి చేశాడు. యువతులు చెప్పిన పని చేయకపోతే వీడియోలు వైరల్‌ చేస్తామని వేధింపులు. నగ్నపూజల కలకలం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి అరుగుర్ని అరెస్ట్ చేశారు.

బెదిరిస్తున్న మాయగాళ్లు

పొద్దుటూరుకు చెందిన ముఠా సభ్యులు పూజలు చేశారని పోలీసులు గురించారు. మహిళకు డబ్బుల ఆశ చూపించి, డబ్బు కోసమే యవతులను టార్గెట్ చేసి వారి చేత నగ్న పూజలు చేయిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్షుద్రపూజలో ఆరుగురు పురుషుల్లో ఒక పూజారి తాడిపత్రి, తిరుపతికి చెందిన వారు ఉన్నారని పోలీసులు గుర్తించారు. నగ్న పూజలు చేస్తున్న పూజారి సహా పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు