Actress Priyamani Married Mustafa Raj: ఈ జాతీయ ఉత్తమ నటి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ తమిళ పొన్ను. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు లేక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణీస్తూ.. సినిమాల్లో బిజీగా ఉంటోంది. అది అలా ఉంటే ప్రియమణి ఓ ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మందికి నచ్చలేదట. ఈ క్రమంలో ఆమె అనేక విమర్శల్నీ ఎదర్కోన్నట్లు తెలిపింది.ఆమె తాజాగా హిందీ చిత్రం ‘మైదాన్’లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నేటికీ చాలా మంది ముస్లిం వ్యక్తితో ఆమె వివాహాన్ని అంగీకరించలేకపోయారని తెలిపింది. ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారని పేర్కోంది.
ప్రియమణి (Priyamani) భర్తపై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు వచ్చయని.. ఇది తనను ఎంతో బాధించిందని తెలిపింది. ప్రియమణి భర్త ముస్తఫా రాజ్‌తో పెళ్లయి 6 సంవత్సరాల తర్వాత కూడా కొందరు ఆమెను ఇంకా ట్రోల్ చేస్తున్నారట. ముస్తఫా రాజ్‌తో ప్రియమణి రెండో పెళ్లి అని తెలిసిందే. అయితే ముస్తాఫా విడాకులు తీసుకోలేదని, అందుకే ప్రియమణితో అతని వివాహం చెల్లదని ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పడంతో ప్రియమణి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. ముస్తఫా రాజ్ ఈ వాదనలు నిరాధారమైనవని తెలిపాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది.
బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రియమణి, ముస్తఫా రాజ్ తొలిసారి కలుసుకున్నారు. ఆమె టోర్నమెంట్ క్రికెట్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ముస్తఫా రాజ్ టోర్నమెంట్ ఈవెంట్ మేనేజర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య సంభాషణ మొదలై.. ఆ తర్వాత మంచి స్నేహితులు అయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య క్రమంగా ప్రేమ చిగురించడం ప్రారంభించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఇద్దరూ కలిసి కనిపించడం.. ఆతర్వాత వీరి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. డ్యాన్స్ రియాలిటీ షో ‘డి ఫర్ డ్యాన్స్’ గ్రాండ్ ఫినాలేలో ముస్తఫా జాతీయ టీవీలో ప్రియమణిని ప్రపోజ్ చేశాడు. ప్రియమణి ఈ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. వారిద్దరి మధ్య ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రియమణి 27 మే 2016న ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది, ఇక ఒక సంవత్సరం తర్వాత 23 ఆగస్టు 2017న వివాహం చేసుకుంది. పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయ్యాక కూడా ఈ నటి సినిమాల్లో రాణించగలుగుతున్నారంటే దానికి కారణం భర్త మద్దతు ఉంది. ప్రియమణి సినిమాలో పని చేయడానికి కనీసం రూ.50-60 లక్షలు తీసుకుంటుంది. ఆమె భర్త కేవలం ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు ‘జింగ్ ఈవెంట్ అండ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్’ యజమాని కూడా ఉన్నారు.