Devara Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న 'దేవర'.. రన్ టైం అన్ని గంటలా?

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్‌ పనులు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అలాగే సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు.

author-image
By Anil Kumar
New Update
ntr devara

NTR Devara Run Time :

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'దేవర'. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి సెన్సార్‌ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అలాగే సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు.

Also Read :  దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..!

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ సుమారు మూడు గంటల రన్ టైం తోనే ఉంటున్నాయి. దేవర సైతం ఈ లిస్ట్ లో చేరిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ రన్ టైం గురించి ఏమాత్రం పట్టించుకోరని రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ప్రభాస్ కల్కి, నాని సరిపోదా శనివారం సినిమాలు నిరూపించాయి. 'దేవర' మూవీ కూడా భారీ కంటెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

Also Read :  తండ్రి మరణం తర్వాత.. మలైకా ఎమోషనల్ పోస్ట్!

దానికి తోడు సినిమా రెండు భాగాలు కావడంతో కొరటాల శివ 'దేవర' స్టోరీని లాంగ్ స్కేల్ లోనే రెడీ చేసినట్లు ఉన్నాడు. తన గత చిత్రం 'ఆచార్య' విషయంలో కంటెంట్ తేడా కొట్టింది. దాంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈసారి దేవర తో భారీ కామ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. కాగా 'జనతా గ్యారేజ్‌' లాంటి కమర్షియల్ సక్సెస్  తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ 'దేవర' పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Also Read :  'హనుమాన్' మేకింగ్ వీడియో..!

ఇక ఇటీవల ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ సినిమా గురించి మాట్లాడుతూ..'  విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అంటూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు. ఇక ఈ సినిమాలో తారక్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, సైన్ తమ్ చాకో, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read :  తమిళ హీరో జీవాకు యాక్సిడెంట్..!

Advertisment
తాజా కథనాలు