Jr NTR : భూ వివాదం కేసు.. ఎన్టీఆర్ టీమ్ ఏం చెప్పిందంటే?! జూనియర్ ఎన్టీఆర్ భూ వివాదంలో తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారని వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారని, ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. By Anil Kumar 17 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి NTR Team Clarity About Land Issue : టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ భూ వివాదంలో తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కొన్న స్థలంపై వివాదం చోటుచేసుకుంది. తాను కొన్న స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ.. DRT ఇచ్చిన ఉత్వర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ మేనేజర్స్ పై ఎన్టీఆర్ ఫిర్యాదు 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి 681 గజాల స్థలం కొనుగోలు చేశారు NTR. కానీ, ఆ స్థలంపై అప్పటికే 5 బ్యాంకుల నుంచి ఆ మహిళ లోన్లు తీసుకుంది. అయితే, ఈ విషయం దాచిపెట్టి ఎన్టీఆర్‌కు ప్లాట్ విక్రయించింది. అయితే, ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు యత్నం చేయగా.. బ్యాంక్ మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! 2019లోనే ఛార్జ్ షీట్ ఫైల్ కాగా దీనిపై పోలీసులు 2019లోనే ఛార్జ్‌షీట్ వేశారు. స్థలం యజమానులు 1996లోనే బ్యాంక్ లో రుణాలు తీసుకోవడంతో తాజాగా ట్రైబ్యునల్.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు.. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ పై ఎన్టీఆర్ టీమ్ తాజాగా స్పందిస్తూ.." ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారు. ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ పేరుని ఉపయోగించవద్దు" అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. - Team @tarak9999 🙏🙏🙏🙏 pic.twitter.com/981BSP8y5d — Maharashtra NTR Fans (@MHNTRfans) May 17, 2024 #jr-ntr #ntr-land-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి