Jr NTR : బర్త్ డే రోజు ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

సోమవారం ఎన్టీఆర్ తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై అమితమైన ప్రేమ చూపిస్తూ బర్త్‌ డే విషెస్ చెబుతున్న ప్రతీ ఒక్కరికి తారక్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు

Jr NTR : బర్త్ డే రోజు ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!
New Update

NTR Special Post On Twitter : 'RRR' మూవీతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ప్రతీ ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరో బర్త్ డే ని అంతే గ్రాండ్ గా జరిపారు.

సోమవారం (May 20) తారక్ బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా అటు అభిమానులు ఇటు సెలెబ్రిటీలు తారక్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ క్రమంలోనే తనపై అమితమైన ప్రేమ చూపిస్తూ బర్త్‌ డే విషెస్ చెబుతున్న ప్రతీ ఒక్కరికి తారక్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

Also Read : గ్రాండ్ గా డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్.. ఆ డైరెక్టర్స్ తో పాటూ హీరోలు కూడా మిస్సింగ్!

మీ అపార ప్రేమకు కృతజ్ఞుడిని

తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు." ప్రియమైన అభిమానులకు కృతజ్ఞతలు. నా మొదటి రోజు ప్రయాణం నుంచి మీరందిస్తున్న మద్దతు, అపరిమితమైన ప్రేమకు ధన్యవాదాలు. దేవర ఫస్ట్‌ సాంగ్‌పై మీరు చూపిస్తున్న ఆదరణ అత్యున్నతమైనది. నాకు అమూల్యమైన శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.." అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

#jr-ntr #ntr-special-post-on-birth-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe