Devara Glipms:  దేవర గ్లింప్స్ .. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం దేవర. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా చిత్ర బృందం దేవర గ్లింప్స్ రిలీజ్ చేసింది.

New Update
Devara Glipms:  దేవర గ్లింప్స్ .. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్

Devara Glipms: యంగ్ టైగర్ ఎన్టీఆర్ , డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరో సారి వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో.. ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. RRR తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమా అప్డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా గ్లింప్స్ జనవరి 8 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన 3 సెకండ్స్ వీడియోలో.. రక్తపు మరకలు ఉన్న ఆయుధాన్ని నీటిలో కడుగుతున్న విజువల్స్ చూపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఇక ఈ ఎదురుచూపులకు తెర దించుతూ.. నేడు దేవర గ్లింప్స్ రిలీజ్ చేశారు.

publive-image

Also Read: Deepthi Sunaina: “నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో” బ్లూ డ్రెస్ లో సునైన భలే ఉందిగా 🥰

తాజాగా చిత్ర బృందం దేవర గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లే గ్లింప్స్ అదిరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్, వీఎఫ్‍ఎక్స్ , అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పవర్ ఫుల్ గా కనిపించింది. అనిరుధ్ రవిచంద్రర్ బ్యాక్‍గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక గ్లింప్స్ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. 'ఈ సముద్రం చేపల కంటే.. కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసింటాది.. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు'. అని ఎన్టీఆర్ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. దేవర గ్లింప్స్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో YUVASUDHAARTS, హిందీలో TSERIES, తమిళ్ లో TSERIESTAMIL, కన్నడలో JRNTROFFICIAL, మళయాలంలో NTRARTSOFFICIAL యూట్యూబ్ ఛానెల్స్ గ్లింప్స్ విడుదలైంది.

Also Read: Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

Advertisment
Advertisment
తాజా కథనాలు