/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/NTR-district-Ibrahimpatnam-near-ring-center-Alpha-supermarket-fire-jpg.webp)
Fire Accident: ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని ఆల్ఫా సూపర్ మార్కెట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు కూడా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. సూపర్‌మార్కెట్‌లోని ప్లాస్టిక్ వస్తువులు అన్నీ పూర్తిగా కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం టిఫిన్ చేయకపోతే ఈ ముప్పు తప్పదు జాగ్రత్త