/rtv/media/media_files/AJLiusVaT4lJEmAil4LN.jpg)
DEVARA
NTR Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'దేవర'. RRR లాంటి పాన్ వరల్డ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, సాంగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా రిలీజ్ కు ముందే మరో అరుదైన ఫీట్ సాధించింది.
1 మిలియన్ డాలర్ ప్రీ సేల్స్
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న 'దేవర' విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్ స్టార్ చేయగా.. భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఏకంగా రూ.8.2 కోట్ల మార్క్‌ను దాటేసి అక్కడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ట్రైలర్ రిలీజ్ కు ముందే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 'దేవర' ట్రైలర్ ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నారు.
He’s turning every part into his RED BLOOD sea ❤️🔥❤️🔥#Devara becomes the fastest Indian Film to hit $1 Million North America Pre Sales without a trailer release 🔥🔥#DevaraUSA Box office Dandayatra 💪🏻
— NTR Arts (@NTRArtsOfficial) September 10, 2024
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/1RlzqeERiB
దేవర ప్రమోషన్స్
ప్రస్తుతం దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ, సైఫ్ అలీఖాన్ పలు ఇంటర్వ్యూస్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్టులుగా రాబోతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
Also Read: "KA" Movie: స్టార్ హీరో చేతికి.. కిరణ్ అబ్బవరం 'క' మలయాళ థియేట్రికల్ రైట్స్..! - Rtvlive.com