NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. కరణ్ చేతికి 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర. తాజాగా ఈ మూవీ థియేట్రిక‌ల్ రైట్స్‌ కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా అనౌన్స్ చేశారు కరణ్.

New Update
NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. కరణ్ చేతికి 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌

NTR Devara: 2024 లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'దేవర' ఒకటి. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. "సినిమా కాస్త లేట్ అయినా సరే కాలర్ ఎగరేసుకునేలా చేస్తాము" అని చెప్పిన మాటలు మూవీ పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

NTR Devara: దేవర కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

కరణ్ చేతికి దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌

ఇది ఇలా ఉంటే.. తాజాగా దేవర థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ ను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

publive-image

గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రాన్ని నార్త్ లో విడుదల చేసింది కూడా ఈ సంస్థే(ధర్మ ప్రొడక్షన్స్). హిందీలో 'బాహుబలి' గొప్ప విజయాన్ని సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి 2' బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఒక్క హిందీ వెర్షన్‌లోనే 510 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు  చేసింది. 'బాహుబలి' ఫ్రాంచైజీ విజయంలో కరణ్ జోహార్ పాత్ర చాలా ఉంది. ఇక ఇప్పుడు ఇదే సంస్థ 'దేవర' నార్త్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. దీంతో నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు.

Also Read: Paarijatha Parvam Trailer: ‘పారిజాత పర్వం’ ట్రైల‌ర్.. వైవా హర్ష కామెడీ నెక్స్ట్ లెవెల్

Advertisment
Advertisment
తాజా కథనాలు