Jr NTR : ఓటు వేసేందుకు వచ్చి అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

New Update
Jr NTR : ఓటు వేసేందుకు వచ్చి అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

Junior NTR Autograph To His Fan : నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎంతటి ఆప్యాయత చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తాను ఎలాంటి ఈబెంట్ కి వచ్చినా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడే మాటలు ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇక తారక్ బయటికి వచ్చినప్పుడు కొందరు ఫ్యాన్స్ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ అడుగుతుంటారు. దానికి తారక్ ఎంతో ఓపికగా వారికి సెల్ఫీలు ఇస్తుంటాడు. తాజాగా ఓటువేసేందుకు వచ్చినా కూడా అభిమాని కోరికను తీర్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read : కూతురికి సంబంధించి ఇన్నాళ్లు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన రేణు దేశాయ్? ఎట్టకేలకు బయటికి!

ఓటు వేసేందుకు వచ్చి అభిమాని కోరిక తీర్చి

ఎన్టీఆర్ తన నిజ జీవితంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారు. ముఖ్యంగా భారతదేశ పౌరుడిగా ప్రతీ ఎన్నికల్లో ఎక్కడ, ఏ షూటింగ్ లో ఉన్నా కూడా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటాడు. తాజాగా జరిగిన తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఓ అభిమాని అన్న.. మీ ఆటోగ్రాఫ్ కావాలని అడగ్గానే ఎన్టీఆర్ వెంటనే ఆ అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంత హడావుడిలో కూడా ఎన్టీఆర్ అభిమాని కోరిక తీర్చడంతో ఫ్యాన్స్ అయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు