NTR : ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన యంగ్ టైగర్..! జూబ్లీహిల్స్ లోని ఓ ప్లాట్ వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. NTR ఫిర్యాదు మేరకు 2019లో పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. తాజాగా DRTలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 17 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Tollywood : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) భూ వివాదంలో తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కొన్న స్థలంపై వివాదం చోటుచేసుకుంది. తాను కొన్న స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ.. DRT ఇచ్చిన ఉత్వర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. Also Read: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..! వివరాల్లోకి వెళ్తే.. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి 681 గజాల స్థలం కొనుగోలు చేశారు NTR. కానీ, ఆ స్థలంపై అప్పటికే 5 బ్యాంకుల నుంచి ఆ మహిళ లోన్లు తీసుకుంది. అయితే, ఈ విషయం దాచిపెట్టి ఎన్టీఆర్‌కు ప్లాట్ విక్రయించింది. అయితే, ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు యత్నం చేయగా.. బ్యాంక్ మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే.. 2019లో ఛార్జ్‌షీట్ వేశారు. స్థలం యజమానులు 1996లోనే బ్యాంక్ లో రుణాలు తీసుకోవడంతో తాజాగా ట్రైబ్యునల్.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు.. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. #tollywood #telangana-high-court #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి