Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనత..ఫుల్‌ జోష్‌ లో ఫ్యాన్స్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎంతో ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో ఎన్టీఆర్‌ కు చోటు దక్కింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో యంగ్ టైగర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనత..ఫుల్‌ జోష్‌ లో ఫ్యాన్స్..!!

Jr NTR in Oscars Academy Award: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్' (Oscar Actors Branch) లో తారక్‌కు చోటు దక్కింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. దీంతో టాలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ (Jr Ntr) అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతోంది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

Also read: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?

View this post on Instagram

A post shared by The Academy (@theacademy)

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తారక్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అయితే, ఈ సినిమాకు ముందు వరకు తారక్ గురించి టాలీవుడ్ కు తప్ప మిగితా ఏ ఇండస్ట్రీకి పెద్దగా తెలియదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' ఒక్క సినిమాతో ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో ఘనతను సాధించాడు.

publive-image

ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్ కు చోటు లభించింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. వీరిలో తారక్ తో పాటు కే హుయ్ క్వాన్ (Ke Huy Quan), కెర్రీ కాండన్ (Kerry Condon), రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తారక్ పై టాలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు