NEET : నీట్‌ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!?

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలను NTA ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష ఒకే సమాయాని మొదలైందని స్పష్టం చేసింది.

New Update
NEET - CBI: నీట్ కేసులో సీబీఐ విచారణ వేగవంతం.. మరో పది మంది అరెస్ట్!

NEET UG 2024 :ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పరీక్ష పేపర్ లీకైదంటూ(Paper Leak) సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్న వార్తలపై నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పందించింది. పేపర్ లీకేజీ ప్రచారం పూర్తిగా అవాస్తమని ఖండించింది. అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు..
ఈ మేరకు దేశవ్యాప్తంగా 557 నగరాలు/పట్టణాలు, ఇతర దేశాల్లో 14 సిటీల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్‌ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌లోని మాంటౌన్‌లోని గర్ల్స్ హయ్యర్‌ సెకండరీ ఆదర్శ్‌ విద్యా మందిర్‌లో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ రావడంతో ఇన్విజిలేటర్‌ ఆ పొరపాటును సరిదిద్దేటప్పటికే విద్యార్థులు పరీక్ష హాలు నుంచి ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు వెళ్లిపోయినట్లు ఎన్‌టీఏ సీనియర్‌ అధికారి ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.

ఇది కూడా చదవండి:ISL: ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్ గా ముంబై.. రెండో టైటిల్‌ కైవసం!

అయితే కొందరు విద్యార్థులు(Students) అలా బలవంతంగా బయటకు వెళ్లడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసినట్లు సదరు అధికారి తెలిపారు. ఆ సమయానికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైందని, అందువల్ల ప్రశ్నపత్రం లీక్‌ కాలేదంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్టీఏ అధికారులు. ఇందులో భాగంగానే ఎన్‌టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లోని మారుమూల పరీక్ష కేంద్రంలో పేపర్ల పంపిణీలో దొర్లిన పొరపాటు తమ దృష్టికి వచ్చిందని, ఆ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 120 మంది విద్యార్థులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసకుంటామని చెప్పింది. ఆ విద్యార్థులకు వేరే తేదీలో మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ పరీక్షలను నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీపడబోమని పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు