సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు

సింగరేణి కార్మికులకు తమ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్మికులకు సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు
New Update

అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులకు పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేప‌థ్యంలో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేత‌నంతో కూడిన సెల‌వు ఇవ్వాల‌ని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా క‌ర్మాగారాలు, దుకాణాలు, ప‌రిశ్రమ‌ల్లో ప‌ని చేసే సిబ్బందికి వేత‌నంతో కూడిన సెల‌వు ఇవ్వాల‌ని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ కార్మిక శాఖ ఒక ప్రక‌ట‌న‌లో వెల్లడించింది.

అలాగూ పోలింగ్‌ పూర్తైన వెంటనే ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1వ తేదీ కూడా సెలవు ఇవ్వాలి అని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే ఈ విషయాలన్నింటిపై త్వరలో అధికారికంగా స్పష్టత రానుంది. అలాగే డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని సమాచారం.

Also read : SBIF Asha Scholarship కోసం అప్లై చేసుకున్నారా.. లాస్ట్ డేట్ ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో చాలా వరకు పాఠశాల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తున్నందున స్కూళ్లకు సెలవు ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్‌ జరగనున్నందున, ఆ రోజుతో పాటు ముందురోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.06 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నమే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

#holiday #november-30 #singareni-workers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe