/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-15T201612.763.jpg)
TG Jobs: తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయగా.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలోని పలు ఖాళీలను పూరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని మొత్తం 755 ఖాళీలను భర్తీ చేయనుండగా.. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.