TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ శాఖలో 6 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్! నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 6 వేల ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏయే కేడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈనెల 8వ తేదీగా ఇవ్వాలని ఆయా HODలను ఆదేశించింది. By Bhoomi 06 Jan 2024 in జాబ్స్ ఖమ్మం New Update షేర్ చేయండి తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో(TS Govt Jobs) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏయే కేడర్ లో ఎన్నిఖాళీలు ఉన్నాయో పూర్తివివరాలను ఈనెల 8వ తేదీలోగా ఇవ్వాలని పలు విభాగాల హెచ్ఓడీ (HOD)లను ఆదేశించింది సర్కార్. ఈ మేరకు కేడర్ వారీగా భర్తీ అయ్యే పోస్టుల సంఖ్యతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య...ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలన్నింటిని హెవోడీలు నివేదికలు తయారు చేయాలని సూచించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు 14వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని...వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టమెంట్ (Department of Medical Education) ఇప్పటివరకే సర్కార్ సూచించినట్లుగా తెలిపింది. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు: గత రెండేళ్లలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. మరో 8 కాలేజీలకు దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని లేకుంటే సమస్యగా మారుతుందని కాలేజీ ప్రిన్సిపల్స్ చెబుతున్నారు. ఆరోగ్య శాఖలో 2వేల ఖాళీలు: వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధిలో నుంచి వీవీపీ పరిధిలోకి అప్ గ్రేడ్ అయిన సుమారు 70 ఆసుపత్రులకు ఇప్పటివరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదు. ఈ ఆసుపత్రులలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మొత్తం 170 వీవీపీ ఆసుపత్రుల్లో కలిపి సుమారు 4,700పోస్టుల ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో మెడికల్ కాలేజీలుగా మారిన 17 ఆసుపత్రుల్లో ఇప్పటికీ వైద్య విధాన పరిషత్ కు సంబంధించిన వైద్యులు, సిబ్బందే పనిచేస్తున్నారు. వీళ్లను వెనక్కు రప్పించి వీవీపీ ఆసుపత్రుల్లో పోస్టింగ్స్ ఇస్తే వేకెన్సీల సంఖ్య కూడా తగ్గుతుంది. సుమారు 15వందల పారామెడికల్ పోస్టులు ఖాళీ ఉండనున్నాయి. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు(Primary Health Centres), అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(Urban Primary Health Centres), నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్న పల్లె దవాఖాన్లలో కలిపి సుమారు 2వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: ప్యాసింజర్ రైల్లో మంటలు.4 బోగీలు దగ్ధం..ఐదుగురు సజీవదహనం..!! #cm-revanth-reddy #primary-health-centres #urban-primary-health-centres #ts-govt-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి