AP Govt Jobs: ప్రభుత్వం ఉద్యోగమే లక్ష్యంగా ప్రీపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీ గవర్నమెంట్ మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఔట్ సోర్సింగ్ నియమాకాలు చేపట్టబోతున్నట్లు తెలుపుతూ మరో ఉద్యోగ ప్రకటన అనౌన్స్ చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం టెన్త్, ఇంటర్ చదివిన వారికి కూడా అర్హత కల్పించడం ఆనందించే విషయం. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 256 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుండగా.. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డెంటల్ వంటి పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 11 వరకూ అప్లయ్ చేసుకోవాలని ఇందుకు సంబంధించిన అధికారులు తెలిపారు.
Also read :శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!
అలాగే ఇక టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ తదితరాల పోస్టును అనుసరించిన అర్హతలు.. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక విధానం చేపడతారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి. ఇందుకు చివరి తేదీ 2023 డిసెంబర్.
ఇదిలా ఉంటే.. తిరుపతి - ఏపీఎస్సీఎస్సీఎల్‌లో కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ- తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL) జిల్లా కార్యాలయం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన తిరుపతి (Tirupati) జిల్లాలో పలు ఖాళీల భర్తీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant) గ్రేడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్.. https://tirupati.ap.gov.in/notice_category/recruitment/ సంప్రదించవచ్చు.