Notices to MVV Satya Narayana: విశాఖలో మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్ తగిలింది. ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్‌కి నోటీసులు ఇచ్చారు. VV పీక్ వెంచర్‌కు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు GVMC కమిషనర్. ఆశీల్మెట్టు టైకూన్ కూడలి దగ్గర CBCNC స్థలంలో వీవీ పీక్ వెంచ్ వేసిన ఎంవీవీ.. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేశారు. దీంతో సమీప భవనాల పునాదులు దెబ్బ తింటున్నాయని స్థానికులు GVMCకి ఫిర్యాదు చేశారు.
Also Read: మనకు ఇదే మఖ్యం.. అవసరమైతే హౌస్ ని ఇలా కూడా చేస్తా.. స్పీకర్ అయ్యన్న..!
అయితే, గతంలో ఈ నిర్మాణాల కోసమే టైకూన్ జంక్షన్‌ను.. మూసివేశారని టీడీపీ (TDP), జనసేన (Janasena) ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై జనసేనాని పవన్ (Pawan Kalyan) ఆందోళన చేశారు. వివాదాస్పద CBCNC భూముల్లో నిర్మాణాలను అడ్డుకుంటాననీ.. ఎవరూ కొనొద్దంటూ గతంలో పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా, GVMC నోటీసులతో ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్ ఆసక్తికరంగా మారింది.